close
Published : 21/04/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రుద్ర’గా ఓటీటీలోకి...

బాలీవుడ్‌ ప్రముఖ కథా నాయకుడు అజయ్‌ దేవ్‌గణ్‌ తొలి వెబ్‌సిరీస్‌ను ప్రకటించారు. ఆయన ఓటీటీ ఫ్లాట్‌ఫాంకి వస్తున్నాడని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ... డిస్నీ-హాట్‌స్టార్‌... అజయ్‌ తొలి    వెబ్‌సిరీస్‌ ‘రుద్ర’ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఇంటెన్సివ్‌ లుక్‌లో అజయ్‌ కనిపించారు. ఇందులో పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక క్రైం, యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దీన్ని బీబీసీ స్టూడియోస్‌ ఇండియా, అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిపై అజయ్‌ దేవ్‌గణ్‌ మాట్లాడుతూ... ‘‘సార్వజనీన కథలు చెప్పడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం నాకు అలవాటు. దీన్ని కొనసాగిస్తూనే... భవిష్యత్తున్న ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై నేను తొలిసారిగా అడుగుపెడుతుండటం ఆనందాన్నిస్తోంది. ‘రుద్ర’-ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌... మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని