close
Published : 20/03/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజసులోచనకు గాయం... ఎన్టీఆర్‌ చికిత్స

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సొంత‌వూరు’‌ (1959) సినిమా షూటింగ్‌ జరు‌గు‌తోంది.‌ ఇది ఘంట‌సాల తీసిన రెండో సినిమా.‌ రాజ‌సు‌లో‌చన నాయిక.‌ ఆ రోజు సెట్లో ఒక పక్క షూటింగ్‌ జరు‌గు‌తున్నా ఇంకో పక్క వేరో చిత్రా‌నికి సెట్టు కడు‌తు‌న్నారు.‌ ఆ మేకులూ, చెత్తా ఇటూ పడుతున్నాయి.‌ రాజ‌సు‌లో‌చన షాట్‌ ముగించు‌కుని వస్తూ ఉంటే కాల్లో ఏదో గుచ్చు‌కున్నట్లు అనిపించింది.‌

ఏదో అను‌కుని, వచ్చి ఎన్టీఆర్‌ పక్కనే కుర్చీలో కూర్చొన్నారు. రామా‌రావు ఐస్‌ వేసిన కూల్‌డ్రింక్‌ తెప్పించు‌కుని తాగ‌బో‌తుండగా, దృష్టి రాజ‌సు‌లో‌చన పాదం మీద పడింది.‌ రక్తం కారుతోంది! ఆమె గమ‌నించ‌లేదు.‌ వెంటనే ఎన్టీఆర్‌ తన చేతిలో ఉన్న డ్రింక్‌ని, అలా కొద్ది కొద్దిగా ఆమె పాదం మీద పోశారు.‌  చేతి గుడ్డతో వత్తారు.‌ ‌‘‌‘అయ్యో నేను చూసు‌కో‌లేదు.‌ ధన్యవాదాలు’‌’‌ అన్నారు రాజ‌సు‌లో‌చన.‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని