close
Published : 20/03/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బడిపంతులు రైలెక్కి రాజబాబు అయ్యాడు!

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేసిన హాస్య నటుల్లో రాజబాబు ఒకరు. ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతం. ఒకానొక దశలో రాజబాబు లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి రాజబాబు తొలుత బడిపంతులుగా పనిచేసేవారు. పిల్లలకి నవ్వుతూ, నవ్విస్తూ పాఠాలు చెప్పేవారట. సినిమాలపై ఆసక్తితో రాజమండ్రిలో రైలెక్కి నుంచి మద్రాసు చేరుకున్నారు. తొలుత కొన్ని నాటకాల్లో హాస్యపాత్రలు వేస్తూనే సినిమా అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవారట. నిర్మాతలు, దర్శకుల దగ్గర రకరకాల గొంతులతో మాట్లాడటం, మిమిక్రీ చేసి నవ్వించడం చేసినా, వెంటనే ఎవరూ వేషాలు ఇచ్చేసి అగ్రిమెంట్లు రాయించేసుకుని అడ్వాన్సులు ఇచ్చేయలేదు. అప్పుడు రావి కొండలరావు ‘కథ కంచికి’ అనే నాటిక రాశారు. దాన్ని ఆంధ్రమహాసభ నాటిక పోటీల్లో ప్రదర్శించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. రాధాకుమారి, పి.జె.శర్మ, పొట్టిప్రసాద్‌, రావి కొండలరావు వారి పాత్రలు చదువుకుంటున్నారు. అందులో, ఆఫీసు కుర్రాడి వేషం ఉంది. చాలా ఉషారైన వేషం, అది సరైన వ్యక్తికి ఇవ్వాలని, ఆ వేషం మాత్రం అలా ఉంచేశారు. ఆ పాత్ర కోసం చలాకీగా ఉండే కుర్రవాడిని చూడమని రావికొండలరావు.. ప్రసాద్‌కు చెబితే.. ‘రాజబాబు అని ఉన్నాడు. ఈ వేషానికి బాగుంటాడు, తీసుకొస్తాను చూడు’ అని సమాధానం ఇచ్చారు‌. పాండీబజార్‌ మొత్తం వెతికి రాజబాబుని తీసుకొచ్చారు. ఒక కొండనిండా గుబురు చెట్లుంటే ఎలా ఉంటుందో అలా ఉందట రాజబాబు జుట్టు. కూర్చోబెట్టి నాటిక, అందులోని వేషం చదివి వినిపించారు. ‘ఈ పాత్ర వెయ్యండి, సినిమావాళ్లు నాటిక చూస్తారు. అవకాశాలు రావొచ్చు. జుట్టు బాగా దగ్గరగా క్షవరం చేయిచండి’ అని చెప్పారట రావి కొండలరావు.

రాజబాబు పుస్తకం తీసుకుని డైలాగులు రాసుకున్నారు. రిహార్సల్స్‌ మొదలుపెట్టారు. ఆ వేషాల్ని రకరకాల భావాలు, భంగిమలతో రాజబాబు పండిస్తున్నారు. వీలున్నప్పుడల్లా రిహార్సల్స్‌ వేస్తూ వచ్చారు. ఆ నాటికకు ‘ఉత్తమ ప్రదర్శన’’, రాధాకుమారికి ఉత్తమ నటి బహుమతులు వచ్చాయి. అప్పుడు ఆలిండియా రేడియోలో ఉన్న జనమంచి రామకృష్ణ లోపలికి వచ్చి నాటక బృందాన్ని అభినందించారు. ‘‘ఎల్లుండి రేడియో స్టేషన్‌కి రండి. రికార్డు చేద్దాం’’ అని పిలిచేసరికి అందరికీ ఆనందం.

వెంటనే వాణీమహల్‌లో ఇంకో రెండు నాటికలతో, ‘కథ కంచికి’ ప్రదర్శించారు. సినిమా ప్రముఖులకి ఆహ్వానాలు పంపిస్తే, చాలామంది వచ్చారు. ముఖ్యంగా కె.వి.రెడ్డి వచ్చి, కొంచెసేపు నాటిక చూసిన తర్వాత వెళ్లబోతూ, మళ్లీ ఆగి అక్కడే నిలబడే, నాటిక చూశారట. మర్నాడే రాజబాబును కె.వి.రెడ్డి తన ఇంటికి రమన్నారు. ఆయనను అభినందించి, ‘‘హరిశ్చంద్ర’’లో (1965) కాలకౌశికుడి శిష్యుల్లో ఒకడిగా వేషం ఇచ్చారు. పి.జె.శర్మకి కూడా ఇచ్చారు. అంతకుముందే రాజబాబు ‘‘సహజం’’ (1960) మొదటి సినిమా మరికొన్ని సినిమాల్లోనూ చిన్నచిన్న వేషాలు వేశారు. డాక్టర్‌ రాజారావు ‘అల్లూరి సీతారామరాజు’, ‘నాలుగిళ్ల చావిడి’ నాటకాలు మంచి పేరు తేవడంతో హాస్యనటుడిగా పేరొచ్చి, సినిమా అవకాశాలు వచ్చారు. ఆ తర్వాత స్టార్‌ నటుడు అయ్యారు. ఎందరినో చదివించారు.. దాన ధర్మాలు చేశారు. హాస్యంతోపాటు ఏడిపించే పాత్రలు కూడా చేశారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని