ప్రసిద్ధ్‌కు పాజిటివ్‌
close
Published : 09/05/2021 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రసిద్ధ్‌కు పాజిటివ్‌

దిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 14వ సీజన్‌ ఆగిపోయినా.. టోర్నీపై కరోనా ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. టోర్నీ ఆపేసిన నాలుగు రోజుల తర్వాత కొత్తగా ఇద్దరు ఐపీఎల్‌ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. అందులో ఒకరు కర్ణాటక ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కాగా.. మరొకరు న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫర్ట్‌. వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌ ఆగిపోయాక ప్రసిద్ధ్‌ తన స్వస్థలం బెంగళూరుకు బయల్దేరే ముందు చివరగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. అయితే అతను విమాన ప్రయాణం ద్వారా బెంగళూరుకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాతి రోజే స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాడు. అందులో పాజిటివ్‌ వచ్చింది. తమ దేశ ఆటగాడు టిమ్‌ సీఫర్ట్‌కు పాజిటివ్‌ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఉన్న సీఫర్ట్‌ను చెన్నైకి తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. బబుల్‌లో తొలుత పాజిటివ్‌గా తేలిన వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు కోల్‌కతా ఆటగాళ్లే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని