జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు కోహ్లీసేన
close
Published : 09/05/2021 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు కోహ్లీసేన

దిల్లీ: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సహా ఆరు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న ఇంగ్లాండ్‌ బయల్దేరనుంది. ఇంగ్లాండ్‌ చేరిన అనంతరం టీమ్‌ఇండియా క్వారంటైన్‌లో ఉండడానికి సంబంధించి బీసీసీఐ ఇంకా చర్చలు జరుపుతోంది. కోహ్లీసేన అక్కడ మూడున్నర నెలలు ఉంటుంది. ప్రయాణానికి ముందు జట్టు ముంబయిలో కూడా క్వారంటైన్‌లో ఉండాలని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.  పర్యటన సుదీర్ఘమైంది కావడం వల్ల ఆటగాళ్లతో వారి కుటుంబ సభ్యులూ వెళ్లనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జూన్‌ 18న ఆరంభమవుతుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని