ఆ కాంస్యంతో..
close
Published : 09/05/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ కాంస్యంతో..

దిల్లీ: ఆసియా క్రీడల్లో (2018) సాధించిన కాంస్య పతకం షూటర్‌గా తాను మరింత సాధించగలనన్న ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని షూటర్‌ అభిషేక్‌ వర్మ చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న అతడికి కెరీర్‌ ఆరంభంలో ‘హబీ షూటర్‌’గా పేరుంది. కాస్త ఆలస్యంగా షూటింగ్‌లోకి వచ్చిన 31 ఏళ్ల వర్మ.. 2018 ఆసియా క్రీడల్లో తన తొలి అంతర్జాతీయ పతకం (10మీ ఎయిర్‌ పిస్టల్‌) గెలిచాడు. ఆ తర్వాత కెరీర్‌లో వేగంగా ఎదిగాడు. 2019లో బీజింగ్‌, రియో ప్రపంచకప్పులలో స్వర్ణాలు గెలిచాడు. ఇప్పుడు అతడు ప్రపంచ నంబర్‌వన్‌. ‘‘నేను 2015లో 27 ఏళ్ల వయసులో షూటింగ్‌ ఆరంభించా. అందరూ నన్ను హాబీ షూటర్‌ అనేవాళ్లు. కానీ ఆసియా క్రీడల్లో పతకంతో ఏదైనా చేయగలనని అనిపించింది. ఇప్పుడు నేను ఒలింపిక్స్‌కు వెళ్తున్నా’’ అని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమంలో వర్మ అన్నాడు. ‘‘షూటింగ్‌లోకి ఆలస్యంగా రావడంపై జనం నన్ను అడుగుతుంటారు. కానీ వయసుతో సంబంధం లేదని నేనంటా. కష్టపడితే విజయం సాధించవచ్చు’’ అని చెప్పాడు. వర్మ సహా 15 మంది సభ్యులు భారత ఒలింపిక్‌ షూటింగ్‌ జట్టు శిక్షణ కోసం మే 11న క్రొయేషియా వెళ్లనుంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని