Taapsee: ఇద్దరు యువకులతో యువతి ప్రేమ కథ - haseen dillruba teaser taapsee
close
Updated : 08/06/2021 10:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Taapsee: ఇద్దరు యువకులతో యువతి ప్రేమ కథ

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలను ఎంచుకొంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నటి తాప్సీ. ఇప్పుడు ‘హసీన్ దిల్‌రూబా’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇద్దరు పురుషుల ప్రేమ మధ్య చిక్కుకున్న యువతిగా తాప్సీ నటించింది. విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ  చిత్రం గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. కాగా కరోనా వల్ల అది కుదరలేదు. ఇప్పుడు కూడా ప్రభావం ఉండటంతో థియేటర్లలో విడుదల కుదరని నేపథ్యంలో ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది. జులై 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో తాప్సీ మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపించింది. ట్రైలర్‌ను మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని