ఇంటర్నెట్ డెస్క్: ఇబ్బందికరమైన శీర్షికతో వీడియో పోస్టు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై యువ కథానాయకుడు విశ్వక్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. వీడియోలు పెట్టేముందు మన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయం గుర్తుంచుకొని కొంచెం ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలని అన్నాడు. ఆ వీడియో పెట్టిన వ్యక్తి 24గంటల్లో క్షమాపణలు చెబుతూ ఇంకో వీడియో పోస్టు చేయకపోతే మీ ఇంటికి వచ్చి వీడియో పెట్టిస్తానని గట్టిగా హెచ్చరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
నందితశ్వేత హీరోయిన్గా నటిస్తున్న ‘అక్షర’ చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. దానికి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. విశ్వక్ గురించి హీరోయిన్ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్సేన్ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్లో ‘విశ్వక్.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా’ అని ఇబ్బందికరమైన థంబ్‌నైల్‌తో పోస్టు చేశారు. ఇది విశ్వక్సేన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ విషయంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ మరో వీడియో పోస్టు చేశారు. కాగా.. యూట్యూబ్‌లో ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయాయంటూ చాలామంది విశ్వక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ