ఇష్టమైన వారికి దగ్గరగా ఉండండి: సన్నీ లియోనీ - hold your loved ones close to you sunny leone
close
Published : 14/05/2021 21:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్టమైన వారికి దగ్గరగా ఉండండి: సన్నీ లియోనీ

ఇంటర్నెట్ డెస్క్: సన్నీలియోని పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిస్మ్ 2’. ఈ సినిమాతో ఆమె కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు మే 13న తన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘‘నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలు నిషా, ఆషర్, నోహ్, నా భర్త డేనియల్ వెబెర్ ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వడంలో తమని తాము మించిపోయారు. నాకెంతో ఆనందంగా ఉంది. మన చుట్టూ ఉన్న అన్నింటిని సంపాదించుకుంటాం. కానీ కుటుంబం లేకుంటే మనం లేము. అదృష్టం ఏమిటంటే నాకు అందమైన కుటుంబం ఉంది. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశ్వీర్వదిస్తాడు. ప్రస్తుతం మనం సురక్షితంగా ఉండాలి. ప్రియమైన వారిని దగ్గరుండి చూసుకోండి. వారిని కాపాడుకోండి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబాన్ని పోషించడం తల్లిదండ్రులుగా అది మన పని, బాధ్యత. మాస్క్ ధరించండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం సన్నీ హిందీ - తెలుగులో తెరకెక్కుతున్న ‘హెలెన్‌’, ‘కోకాకోల’లో నటిస్తోంది. విక్రమ్ భట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ వెబ్‌ సిరీస్‌ చిత్రం ‘అనామిక’లో కీలకపాత్ర పోషిస్తోంది. రమేష్ తీటే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్’ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని