ఇండియాలో విడుదలకానున్న 'హోస్ట్'   - horror film host to digitally release on may 7
close
Published : 05/05/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండియాలో విడుదలకానున్న 'హోస్ట్'  

ముంబయి: రాబ్‌ సావేజ్ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ హారర్‌ చిత్రం ‘హోస్ట్’, గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇండియాలో 4 భాషల్లో విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో  ప్రేక్షకులను  అలరించేందుకు సిద్ధమైంది. మే 7న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది పిక్చర్ వర్క్స్ సీఈవో అవినాష్ తెలిపారు. చిత్రంలో గెమ్మ హర్లీ, జెడ్ షెపర్డ్ కథను అందించగా హేలీ బిషప్, జెమ్మ మూర్, రాడినా డ్రాండోవా, కరోలిన్ వార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. డగ్లస్‌ కాక్స్, క్రెయిగ్ ఇంగ్లెర్, ఎమిలీ గొట్టోలు నిర్మాతలు. గతేడాది యూఎస్‌లో విజయం సాధించిన ఈ సినిమా కథ ఏంటంటే, కొవిడ్‌ కారణంగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న స్నేహితులు బృందంగా ఏర్పడి వారాంతరపు జూమ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. వారిలో ఓసారి హేలీ తన జూమ్‌ సమావేశం జరుగుతుండగా బృందంలో ఒకరైన జిన్నీకి అంతరాయం కలిగిస్తుంది. దీంతో టెడ్డీ ఆ సమావేశం నుంచి వైదొలుగుతాడు. ఆ సభ్యుల్లో మరొకరైన జెమ్మా ఆత్మహత్య చేసుకున్న తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు చెబుతోంది. ఇలా విభిన్నమైన స్నేహితుల ఆ జూమ్‌ సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తుంటారు. ఆ తర్వాత వారి జూమ్‌ మీటింగ్‌లో ఏం జరిగిందనేది మిగిలిన కథ.  కొవిడ్‌ నిబంధనల కారణంగా దర్శకుడు రాబ్ సావేజ్ సామాజిక దూరం పాటిస్తూ  చిత్ర నిర్మాణ సమయంలో ఏ ఒక్క నటీనటుల దగ్గరకు వెళ్లకుండా రిమోట్‌ దర్శకత్వం వహించారు. షాడో హౌస్‌ ఫిల్మ్స్ పతాకంపై సినిమా నిర్మితమైంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని