అది నా కోరిక - i am yet to do the typical naachgaana in hindi films says rakulpreet singh
close
Published : 21/06/2021 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది నా కోరిక

ముంబయి: దక్షిణాదిలో అగ్రతారగా కొనసాగుతూనే.. హిందీలోనూ సత్తా చాటే ప్రయత్నం చేసింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అజయ్‌దేవ్‌గణ్‌ సరసన నటించిన ‘దే దే ప్యార్‌ దే’తో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు పెరిగాయి. మరో పక్క దక్షిణాది సినిమాలు ఉండనే ఉన్నాయి. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలను బ్యాలెన్స్‌ చేయడం గురించి రకుల్‌ మాట్లాడుతూ ‘‘దే దే ప్యార్‌ దే’ తర్వాత నా కెరీర్‌ కొత్త దశలోకి అడుగుపెట్టింది. నాకు చేతినిండా పని ఉంది. కరోనా టైమ్‌లోనూ నా దగ్గర చాలా సినిమాలున్నాయి. తెలుగు, హిందీ సినిమాల్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం నాకు అంత కష్టంగా ఏమీ అనిపించడం లేదు. ఎందుకంటే నేను ఎక్కువగా కష్టపడతాను. నా షెడ్యూల్‌ను ఓపద్ధతిగా ప్లాన్‌ చేసుకుంటుంటాను. టైమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలిస్తే మనం అనుకున్నవి ఇంకా చాలా చెయ్యొచ్చు. నేను హిందీలో చాలా రకాల సినిమాలు చేస్తున్నా. అదిరిపోయే పాట, హుషారెత్తించే స్టెప్పులుండే తరహా సినిమా ఇంకా చేయలేదు. అలాంటిది చేయాలనేది నా కోరిక. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. తెలుగు చిత్రాలు చేయడం కొంచెం తగ్గించాను’’ అని చెబుతోంది. హిందీ చిత్రాలు ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘మేడే’, ‘డాక్టర్‌జి’తో పాటు క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది రకుల్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని