Vaishnav Tej: ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా - i did not like her becasue i love her very much says vaishnav panja
close
Published : 11/06/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaishnav Tej: ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా

ఆసక్తికర విషయాలు బయటపెట్టిన వైష్ణవ్‌

హైదరాబాద్‌: ‘ఉప్పెన’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన నటుడు వైష్ణవ్‌ తేజ్‌. మెగా కాంపౌండ్‌ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యువ కెరటం మొదటి సినిమాతోనే తనలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసి అందరితో వావ్‌ అనిపించుకున్నాడు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కొంత సమయం ముచ్చటించారు. ఇందులో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. వైష్ణవ్‌ పంచుకున్న ఆ విశేషాలు మీకోసం..

మీకు క్రికెట్‌ ఇష్టమేనా? మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు?

నాకు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. నేను బ్యాట్స్‌మేన్‌. నా అభిమాన క్రికెటర్‌ ధోనీ. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టీమ్‌ నా ఫేవరెట్‌

మీ చిరునవ్వుకు కారణమేమిటి?

ఎదుటివాళ్ల ఆనందంలో నా చిరునవ్వు దాగుంది.

బర్గర్‌ లేదా పిజ్జా? టీ లేదా కాఫీ? రెస్టారెంట్‌ ఫుడ్‌ లేదా స్ట్రీట్‌ ఫుడ్‌?

స్ట్రీట్‌ ఫుడ్‌ని నేను ఇష్టంగా తింటాను. అలాగే బర్గర్‌, పిజ్జా, కాఫీ, టీ ఇవన్నీ ఇష్టమే.

మీకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందా?

లేదు

మీ అభిమాన హీరో ఎవరు? సినిమా ఏమిటి?

రజనీకాంత్‌ సర్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘శివాజీ’ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ 

మీకు ఇష్టమైన ఆహారం?

అన్నం, టమాట పచ్చడి

‘ఉప్పెన’లో మీకిష్టమైన సన్నివేశం ఏమిటి?

బేబమ్మ.. ఆసిని మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఫైట్‌ సీన్‌

మీరు పరీక్షల్లో ఎప్పుడైనా ఫెయిల్‌ అయ్యారా?

చాలాసార్లు పరీక్షల్లో తప్పాను.

మీ తదుపరి చిత్రాలేమిటి?

క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. అలాగే భవిష్యత్తులో చాలా ప్రాజెక్ట్‌లు వరుసకట్టనున్నాయి.

మీకిష్టమైన కలర్‌? ప్రదేశం?

బ్లూ కలర్‌ అలాగే థాయ్‌లాండ్‌లోని phuket అంటే ఇష్టం

మీకిష్టమైన హీరోయిన్‌?

నజీరియా

బేబమ్మ గురించి ఎవ్వరికీ తెలియని ఒక విశేషం చెప్పగలరు?

కృతిశెట్టి మంచి సింగర్‌

సమంత గురించి ఏమైనా చెప్పగలరు?

ఫ్యామిలీ మేన్‌-2లో సమంత నాకెంతో నచ్చేసింది.

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?

బద్రి, ఖుషి, తమ్ముడు

మీకు స్ఫూర్తి ఎవరు?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌

సోనాక్షి అంటే మీకు ఎందుకు ఇష్టం?

ఇష్టం కాదు నేను ఆమెను ప్రేమిస్తున్నా

ఒక్క మాటలో ఆయన ఏమన్నారంటే..

సాయి ధరమ్‌తేజ్‌ - స్వచ్ఛమైన మనస్సు ఉన్న వ్యక్తి

వరుణ్‌ తేజ్‌ - కింగ్‌

అల్లు అర్జున్‌ - స్టైల్‌

రామ్‌చరణ్‌ - ఆకర్షించే మనస్సు కలిగిన వ్యక్తి

ప్రభాస్‌ - పెద్ద అన్నయ్య

ఎన్టీఆర్‌ - మంచి కోరే వ్యక్తి

విజయ్‌ సేతుపతి - సింపుల్‌

బెస్ట్‌ ఫ్రెండ్‌ - అమ్మ

జబర్దస్త్‌ - చూస్తుంటాను

తమిళం - నేర్చుకుంటున్నాను

వంట - వంట చేయడం కొంచెం వచ్చు

ఇష్టమైన జోనర్‌ - యాక్షన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని