Ananya: ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పను - i do not want to answer this type of question now says ananya
close
Published : 08/05/2021 21:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ananya: ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పను

పెళ్లైందా అంటూ నటిని షాక్‌కు గురిచేసిన నెటిజన్‌

హైదరాబాద్‌: ‘మల్లేశం’తో కథానాయికగా వెండితెరకు పరిచయమై ‘ప్లేబ్యాక్‌’తో అలరించి.. ‘వకీల్‌సాబ్‌’లో దివ్యగా మెప్పించిన చిన్నది అనన్య. నటించింది కేవలం మూడు సినిమాల్లోనే అయినప్పటికీ అనన్యకు తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ మెండుగా ఉంది. కరోనా కారణంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్న అనన్య తాజాగా కొంత సమయంపాటు ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

మీరు మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదు?

కొవిడ్‌ లేని సమయంలో మనందరం సాధారణ జీవితాలు గడుపుతున్నప్పుడు నేను ఆ ఫొటో తీసుకున్నాను. అప్పట్లో మాస్క్‌ అనే కాన్సెప్ట్‌ లేదు. ఆరోజుల్ని నేను ఎంతో మిస్‌ అవుతున్నా.

ఇప్పటివరకూ మీరు నటించిన మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన నిర్మాత ఎవరు?

ఇది ఇంటర్వ్యూ కాదు. నేను ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పను.

‘ప్లేబ్యాక్‌-2’ ఎప్పుడు వస్తుంది?

హరి(దర్శకుడు) సర్‌ ఈ ప్రశ్న మీకే. దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.

మీకు పెళ్లి అయ్యిందా?

వామ్మో ఇదేం ప్రశ్న.. ఇంకా కాలేదు.

మిమ్మల్ని ఏం ప్రశ్నిస్తాం? ఒకవేళ మేము ఏమైనా అడిగినా మీరు సమాధానం చెబుతారో లేదో?

వీలైనంత వరకూ అందరికీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న బ్రో.

మీ రోజువారీ డైట్‌ ఏమిటి?

గత పది రోజుల నుంచి బయటకు వెళ్లడం లేదు. ఆఖరికి మా ఇంటి తలుపులు కూడా తెరవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి డైట్‌ ఫాలో కావడం లేదు.

మీ ఇంటి అడ్రస్‌ చెప్పండి?

ఇంటి అడ్రస్‌తోపాటు ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు కూడా ఇచ్చేయనా..!

‘వకీల్‌సాబ్‌’లో మీ అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుంది. నిజ జీవితంలో కూడా మీరు ఇలాగే ఉంటారా?

నేను ఏమీ తెలియని అమాయకురాలినండి. మీరు నమ్మాలి, నమ్మితీరాలి. వేరే అప్షన్‌ లేదు.

మీ అందానికి రహస్యం ఏమిటి?

అందం గురించి మీకు సలహాలు, సూచనలు ఇవ్వగలనని అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు కూడా ముఖంపై మొటిమలు ఉన్నాయి. అవి పోవడం లేదు. ఫిల్టర్స్‌, మేకప్‌ లేకపోతే అవి కనిపిస్తాయి.

షూటింగ్స్‌కి వెళ్తున్నారా? లేక ఇంట్లోనే ఉంటున్నారా?

షూటింగ్స్‌కి వెళ్లడం లేదండి. పదిరోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. చెప్పానుగా మా ఇంటి తలుపులు కూడా తెరవడం లేదు. బయట పరిస్థితులు చూసి అంత భయపడిపోయాను.

మీకిష్టమైన నాన్‌వెజ్‌ వంటకం?

నేను పూర్తి శాకాహారిని

ఫ్యామిలీతో టైమ్‌ లేదా ప్రపంచ పర్యటన ఈ రెండింటిలో దేనికి ఆసక్తి చూపిస్తారు?

కుటుంబంతో కలిసి ప్రపంచ పర్యటన

ఈ మధ్య చూసినా లేదా చూస్తున్న వెబ్ సిరీస్‌లు ఏమిటి?

గతేడాది నేను ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌ చూడలేదు. తాజాగా దాన్నే వీక్షించాను. ఎందుకంటే ‘ఫ్యామిలీమ్యాన్‌-2’ త్వరలో విడుదల కానుంది కదా. అందులో అసలే మన సామ్‌ ఉంది.

లాక్‌డౌన్‌ కారణంగా ఫొటోషూట్స్‌ మిస్‌ అవుతున్నారా?

మనకి లాక్‌డౌన్‌ లేదు కదా అండి. అయినా కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు చూస్తుంటే చాలా భయంగా ఉంటుంది. అందుకే మొన్న ఒక ఫొటో షూట్‌ అనుకున్నాను కానీ క్యాన్సిల్‌ చేసేశాను. పరిస్థితుల కొంచెం చక్కబడిన తర్వాత తప్పకుండా ఫొటోషూట్స్‌తో మీ ముందుకు వస్తా.

వెళ్లు.. వెళ్లు.. ఈ మధ్య దేవతలకి భూలోకం రావడం బాగా అలవాటు అయ్యింది. పో మీ లోకానికి..

మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు ఎక్కడో టాప్‌లో ఉండాలి.

థియేటర్‌ లేదా ఓటీటీ.. ఏది ఇష్టం?

వ్యక్తిగతంగా నాకు థియేటర్‌ అంటేనే ఇష్టం. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఆ అనుభూతి ఓటీటీలో రాదు.

ప్రభాస్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

నాకు ప్రభాస్‌ సర్‌ స్టైల్‌ అంటే ఎంతో ఇష్టం. బాగుంటుంది. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది.

నువ్వు నాకు ప్రపోజ్‌ చేస్తావా? లేదా నేను నీకు ప్రపోజ్‌ చేయలా?

ఏమైనా అప్షన్స్‌ ఇచ్చారా నాకు.

మధుబాల, సావిత్రి తర్వాత మీరే అని బయట టాక్‌. దానిపై మీరు ఏమంటారు?

కొత్తగా వచ్చాననే కదా మీరు నన్ను ఇలా అంటున్నారు. మాకు కూడా సమయం వస్తుందండి. వాళ్లంత కాకపోయినా వాళ్లలో కొంచెం చేస్తాం.

ప్లేబ్యాక్‌ ఏ ఓటీటీలో విడుదలయ్యిందా?

చాలామంది నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఇంకా ప్లేబ్యాక్‌ ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనూ విడుదల కాలేదు. త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

‘మల్లేశం’ సినిమా ఎంతో బాగుంటుంది. ఆ సినిమాలో మీ కో స్టార్‌ ప్రియదర్శి గురించి ఏమైనా చెప్పగలరు?

దర్శి ఎంతో సపోర్ట్‌ చేసే వ్యక్తి. నా మొదటి కోస్టార్‌ అతనే. సెట్‌లో బాగా సపోర్ట్‌ చేసేవారు. అలాగే ఎంతో సరదాగా ఉండేవారు.

వకీల్‌సాబ్‌లో మీ పాత్రకు మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారా?

అవును. నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని