ఇంటర్నెట్‌డెస్క్: చిరంజీవి కథానాయకుడిగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘అంజి’. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్‌ను సినిమాను తలపించేలా గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొందీ చిత్రం. కాగా, ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజుల పాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. సినిమా అంత భారీగా తీయడం వెనుక నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డికి దక్కుతుందన్నారు.
‘‘నా జీవితంలో మర్చిపోలేని చిత్రమది. ఆ సినిమాకు పనిచేసిన వారందరినీ ప్రశంసించాలి. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. ఎందుకంటే ‘అమ్మోరు’ తర్వాత శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి చిరంజీవి డేట్స్ ఇస్తానని అన్నారు. సాధారణంగా చిరంజీవి అంటే కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటాం. కానీ, ఆయనతో గ్రాఫిక్స్‌తో సినిమా చేస్తానని శ్యాంగారు కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని నాకు చెప్పారు. ‘అయ్యో.. చిరంజీవిగారితో గ్రాఫిక్స్ సినిమా ఎందుకండీ.. ఆయనకు సరిపోయే కమర్షియల్ కథ నా దగ్గర ఉంది. పైగా డ్యూయల్ రోల్. అది చేద్దాం’ అని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో శ్యాంగారికి తెలియకుండా నేను చిరంజీవిగారిని కలిసి ‘సర్.. గ్రాఫిక్స్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది. పైగా గంటల తరబడి నిలబడాలి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేయాలి’ అని చెప్పా. ‘రామకృష్ణా మీరు ఏం కంగారు పడకండి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేస్తా. ఎన్నిరోజులైనా చేస్తా’ అని అన్నారు. చిరంజీవిగారు అదే టెంపోలో సినిమా మొత్తం కనిపించారు’’
‘‘ఇంటర్వెల్ సీన్ నెల రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో చిరంజీవిగారిని ‘ఒరేయ్’ అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా? అని వెతికాం. చివరికి నాగబాబుగారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి ఐదేళ్లు పట్టింది. శ్యాంగారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్‌వర్క్ సింగపూర్, మలేషియా, అమెరికాల్లో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీసిన షాట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లం. మరుసటి రోజు ఆ డిస్క్‌లోని షాట్స్ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను ఇక్కడికి పంపేవాళ్లు’’
‘‘ఇక గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్‌ను కొనసాగించాం. ‘అంజి’ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యాంగారికి. ఆ తర్వాత చిరంజీవిగారికి. చిరంజీవిగారు, హీరోయిన్, విలన్ తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఒకవేళ ఈ ఐదేళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నాం. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతను ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి వద్ద అడ్డుక్కునే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించాం. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం’’అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ