‘జోకర్‌’కు సీక్వెల్‌? - joker sequel reportedly still in development
close
Published : 10/05/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జోకర్‌’కు సీక్వెల్‌?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జోకర్‌’ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించిన చిత్రం. జోక్విన్‌ ఫోనిక్స్‌ జోకర్‌ పాత్రలో నటించిన ఈ సినిమాని టాడ్‌ ఫిలిప్స్‌ తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడమే కాదు అందరి ప్రశంసలు అందుకుందీ చిత్రం. పలు అంతర్జాతీయ పురస్కారాలూ దక్కాయి. 92వ ఆస్కార్‌ పురస్కారాల్లో 11 నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజనల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో దర్శకుడు టాడ్‌ ఫిలిప్స్‌ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫోనిక్స్‌తో మళ్లీ పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు’’అని చెప్పారు. ‘తొలి చిత్రం ఎంతగా మెప్పించిందో అంతే స్థాయిలో ఉండే కథ సిద్ధమైతే కచ్చితంగా సీక్వెల్‌ చేస్తాను’’అని చెప్పారు ఫిలిప్‌. ఏది ఏమైనా సీక్వెల్‌ చేయడానికి సంబంధించిన ఆలోచనలు సాగుతున్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నాయి హాలీవుడ్‌ వర్గాలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని