ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి కంగన రనౌత్ కొత్త అవతారం ఎత్తనుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె త్వరలోనే వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారంట్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుందామె. అంతేకాదు.. దీన్ని తన డ్రీమ్ వెంచర్ అని చెప్పుకొచ్చింది. కొత్త వ్యాపారానికి సంబంధించి తన బృందంతో చర్చిస్తున్నప్పటి ఫొటోలను కూడా పంచుకుందామె.
‘ఈ కొత్త వెంచర్ నా కల. మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. సినిమాలు కాకుండా చెప్పాలంటే నాకు ఇష్టమైంది ఆహారం. అందుకే ఈ ఆలోచనతో మీకు మరింత దగ్గర కావాలనుకుంటున్నా. మనాలిలో రెస్టారంట్ నిర్మించాలన్న నా కలను సాకారం చేసుకోవడంలో నాకు అండగా నిలుస్తున్న మా బృందానికి కృతజ్ఞతలు’ అని ఆమె పేర్కొంది. కంగన ప్రస్తుతం స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ‘థాకడ్’లో నటిస్తోంది. మరో చిత్రం ‘తేజస్’లో ఆమె భారత వైమానిక దళ పైలట్‌గా కనిపించనుంది. ఇవే కాదు ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లోనూ నటించింది. ‘తలైవి’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!