ముంబయి: బాలీవుడ్ అగ్రకథానాయిక, బేబో కరీనాకపూర్ మరోసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కపూర్-ఖాన్ నివాసాల్లో వేడుకలు జరుగుతున్నాయి. తల్లీ బిడ్డా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. మరోవైపు కరీనా దంపతులకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో పుత్రోత్సహంతో సైఫ్ కరీనా నుదిటిపై ముద్దు పెడుతూ కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడిన కరీనా 2012లో ఆయనతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు 2016లో తైమూర్ అలీఖాన్ జన్మించాడు. ఈ క్రమంలోనే తాను మరోసారి గర్భం దాల్చానని గతేడాది కరీనా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతానికి కరీనా.. ఆమిర్‌ఖాన్ సరసన ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’