‘సీత’ కోసం కరీనా భారీ డిమాండ్‌..! - kareena kapoor is demanding rs 12 crore
close
Published : 09/06/2021 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సీత’ కోసం కరీనా భారీ డిమాండ్‌..!

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల పౌరాణిక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు భారీ బడ్జెట్‌ వెచ్చించి మరీ పౌరాణిక చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. ఇప్పుడు మరో పౌరాణిక చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. సీతాదేవి కోణం నుంచి రామాయణాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో సీత పాత్రను బాలీవుడ్‌ స్టార్‌ కరీనాకపూర్‌ పోషించనుందట. అయితే.. ఈ చిత్రంలో నటించేందుకు ఆమె షరతులు పెట్టిందట.

ఈ పౌరాణిక చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించనున్నారట. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సీత పాత్రకు కరీనా అయితే న్యాయం చేయగలదని భావించిన చిత్రబృందం ఆమెను సంప్రదించిందట. కాగా.. మామూలు సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు పోషించడానికి సీత పాత్ర పోషించడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో చేయాలంటే రూ.12కోట్లు ఆమె డిమాండ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు కేవలం 6నుంచి 8కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటోంది.

సీతగా మెప్పించాలంటే అందుకు ముందు నుంచే మానసికంగానూ ఎంతో సన్నద్ధం కావాలి. ఆ తర్వాత మొత్తం షూటింగ్‌ పూర్తయ్యే సరికి కనీసం 8 నుంచి 10 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకూ మరో చిత్రం చేయడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంతటి భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్రబృందం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని