close
Published : 12/04/2021 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఖిలాడి’ వచ్చేశాడు..!

ఆకట్టుకునేలా రవితేజ కొత్త సినిమా టీజర్‌

హైదరాబాద్‌: ‘ఇఫ్‌ యు ప్లే స్మార్ట్‌ విత్‌ అవుట్‌ స్టుపిడ్‌ ఎమోషన్స్‌ యు ఆర్‌ అన్‌స్టాపబుల్‌’ అని అంటున్నారు మాస్‌ మహారాజ్‌ రవితేజ. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ‘ఉగాది’ కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌లో రవితేజ నటన, స్టైల్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

‘క్రాక్‌’ వంటి కమర్షియల్‌ విజయం తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రమిదే. ఇందులో ఆయన సరసన డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని