‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
ఇంటర్నెట్‌డెస్క్: ‘కోలు కోలుమ్మా.. కోలు కోలు నా సామి.. మనసే మేలు కొని చూసే.. కలలో నిండిన వాడే.. కనుల ముందుట ఉంటే నూరేళ్లు నిదుర రాదులే’ అంటూ తనకు కాబోయే వాడి గురించి పాట పాడుతూ ఫిదా చేసింది సాయి పల్లవి. రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలందిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలోని ‘కోలు కోలు’ అంటూ సాగే లిరికల్ వీడియోను అగ్ర కథానాయకుడు వెంకటేశ్ విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, దివ్య మాలికా, సురేశ్ బొబ్బిలి ఆలపించారు.
దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటి వరకు కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు’’ అని చిత్ర బృందం ఇప్పటికే తెలియజేసింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రన్ని, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్