సందడి చేస్తోన్న ‘కోతి కొమ్మచ్చి’ థీమ్‌ సాంగ్‌ - kothi kommacchi theme song
close
Published : 23/04/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందడి చేస్తోన్న ‘కోతి కొమ్మచ్చి’ థీమ్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న, రిద్ధి కుమార్‌, మేఘా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కోచి కొమ్మచ్చి’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థీమ్‌ సాంగ్‌ని నిర్మాత దిల్ రాజు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ‘ఈ మ్యాజిక్‌ చూడరా చిన్నా.. లవ్‌ లాజిక్‌ చూడరా కన్నా’ అంటూ ప్రారంభమయ్యే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ఇంగ్లిష్‌ రైమ్స్‌తో పాత్రల స్వభావాన్ని తెలియజేసే తీరు మెప్పిస్తోంది. శ్రీమణి రచించిన ఈ పాటని స్వీయ సంగీత దర్శకత్వంలో అనూప్‌ రూబెన్స్‌ ఆలపించారు.

ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ  నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, కూర్పు: మధు,కళ: రామాంజనేయులు. ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని