acharya: 5కోట్ల వ్యూస్‌ దాటిన ‘లాహే..లాహే’ - laahe laahe song from acharya hits 50m milestone
close
Updated : 09/06/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

acharya: 5కోట్ల వ్యూస్‌ దాటిన ‘లాహే..లాహే’

ఇంటర్నెట్‌ డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయిక నటిస్తుండగా రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఆ మధ్య ‘లాహే..లాహే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యాబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ని దాటి దూసుకుపోతోంది. పాటకి రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించగా హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’,  ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చిరంజీవి, రామ్‌చరణ్ పలికిన ఈ సంభాషణలు అభిమానులను అలరిస్తున్నాయి. చిత్రంలో పూజాహెగ్డే, సోనూసూద్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, జిస్సు సేన్‌ గుప్తా, రెజీనా తదితరులు నటిస్తున్నారు. రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి నిర్మాతలు. మే13న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది ఈ చిత్రం, కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని