Mahesh Babu: గౌత‌మ్ స్విమ్మింగ్‌ రికార్డు  - mahesh babu son gautam ghattamaneni create a record in swimming
close
Updated : 17/06/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahesh Babu: గౌత‌మ్ స్విమ్మింగ్‌ రికార్డు 

ఇంట‌ర్నెట్ డెస్క్: మ‌హేశ్ బాబు- న‌మ్ర‌తా శిరోద్క‌ర్ దంప‌తుల కుమారుడు గౌత‌మ్ స్విమ్మింగ్‌లో రికార్డు నెల‌కొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈత‌గాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ అనిపించుకున్నాడు. ఈ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు న‌మ్ర‌తా.  2018లో ఫ్రొఫెష‌న‌ల్ స్విమ్మర్‌గా మారిన‌ గౌత‌మ్ 15 ఏళ్ల వ‌య‌సులోనే ఈ ఘ‌న‌త సాధించాడు. గౌత‌మ్‌.. 3 గంట‌ల్లో 5 కి.మీ. దూరాన్ని ఈద‌గ‌ల‌డ‌ని, బ‌ట‌ర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు ప‌ద్ధ‌తుల్లో ఈత కొడ‌తాడ‌ని తెలిపారు న‌మ్ర‌తా. ‘1 నేనొక్క‌డినే’ చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యమ‌య్యాడు గౌత‌మ్. మ‌హేశ్ బాబు హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇందులో చిన్న‌ప్ప‌టి మహేశ్ బాబు పాత్ర పోషించాడు గౌత‌మ్‌. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని