ప్రశాంతత కోసం మూడు యోగాసనాలు: మలైకా - malaika shares 3 yoga asanas for moms to feel relaxed
close
Published : 11/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రశాంతత కోసం మూడు యోగాసనాలు: మలైకా

ఇంటర్నెట్‌ డెస్క్: ‘దిల్‌ సే’ చిత్రంలో ‘ఛయ్యా ఛయ్యా’ అంటూ బాలీవుడ్‌లో ఐటెమ్‌ భామగా అరంగేట్రం చేసిన నటి మలైకా అరోడా. ఈమె నటిగానే కాకుండా పలు టీవీ  డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మదర్స్ డే సందర్భంగా 3 యోగాసనాలు వేసి వాటి గురించి వివరిస్తూ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది 47 ఏళ్ల మలైకా. ప్రతిరోజు ఇంట్లో ఉండే అమ్మలు ప్రతి తల్లి సాధన చేయవలసిన మూడు ఆసనాలు. ‘రిలాక్స్, ప్రశాంతతమైన అనుభూతి చెందేందుకు మీరు అర్హులు. మీరు వృక్షాసన, త్రికోణాసన, ఉత్కాసన ఈ మూడు ఆసనాలు వేయండి. 1.వృక్షాసనం: ఒక కాలు మీద నిలబడి తమను తాము సమతుల్యం చేసుకుంటూ,  చేతులను నేరుగా పైకి చాచుకోవాలి దీనివలన శరీర భంగిమను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. శారీరక, మానసిక భావోద్వేగాల సమతుల్యతను కాపాడుతుంది.  2.త్రికోణాసన: ఇందులో తమ కాళ్ళను చాచి కుడి పాదాన్ని కుడి చేతితో తాకి, ఎడమ చేతిని పైకి చాచుకోవాలి. ఈ ఆషనం ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులకు సహాయపడుతుంది. 3.ఉత్కాసన: ఇందులో మోకాళ్లతో వంగి నిలబడాలి. పైభాగాన్ని నిటారుగా ఉంచి వారి చేతులను ఒక చోట చేర్చాలి. ఈ ఆసనం మొత్తం శరీరంలో బలాన్ని పెంచుతుంది, ముఖ్యంగా వెనుక కండరాలను భుజాలలో మధ్య ఉన్న దాన్ని గట్టి పరుస్తుందని’’ పేర్కొంది. మలైకా  తెలుగులో మొదటి సారిగా మహేష్‌బాబు నటించిన ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రైనా నాకు ఓకే’ పాటలో ఆడిపాడింది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘గబ్బర్‌ సింగ్‌’ ‘కెవ్వు కేక’ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంది. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా ప్రస్తుతం అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని