RC15: చరణ్‌ చిత్రం కోసం? - malavika mohanan in ram charan and shankar film
close
Published : 05/06/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RC15: చరణ్‌ చిత్రం కోసం?

హైదరాబాద్‌: ఈ యేడాది ఖరారైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్‌ - శంకర్‌ సినిమా ఒకటి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్న ఈ సినిమా గురించి తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్‌కి జోడీగా నటించనున్న కథానాయిక ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న మొదలుకొని పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. మరి శంకర్‌ ఈమెకే ఓటేస్తాడా? లేక మరో భామని పరిశీలిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని