close
Published : 27/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్ చరణ్ పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు చెప్పలేనంత ఆనందం. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా రామ్‌ చరణ్‌ కోసం ప్రత్యేకంగా ‘మెగా పవర్‌స్టార్‌ ట్రిబ్యూట్‌ సాంగ్‌’ను విడుదల చేశారు. ‘‘చిరుత’తోనే అడుగెట్టి... మగధీరుడిలా హిట్టుకొట్టి.. ’’అంటూ సాగే ఈ ప్రత్యేక సాంగ్‌ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకి ఎస్‌జేపీ సాహిత్యం అందించి ఆలపించగా ది డ్రాప్లెట్జ్ (ఫ్లీప్, అరిన్ డెజ్) సంగీతం అంచారు. ఈ పాటకి దగ్గుశెట్టి సుజయ్ బాబు, సుమంత్ కొప్పరావూరి నిర్మాతలుగా వ్యవహరించగా మధుర ఆడియో గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’లో సిద్ధ అనే పాత్ర పోషిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని