close
Published : 18/02/2021 22:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బన్నీ సోదరిగా మేఘా ఆకాష్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయకగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కథానాయిక మేఘా ఆకాష్‌  నటించనుందని సమాచారం. బన్నీ సోదరిగా కీలక పాత్రలో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆ మధ్య రాజమండ్రి పరిసర ప్రాంతంలోని మారేడుమిల్లి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీని జవనరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు13, 2021న ప్రేక్షకుల మందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. మేఘా ఆకాష్‌ తొలుత తెలుగులో ‘లై’ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసింది. ఇందులో కథానాయకుడిగా నితిన్‌ నటించారు.ఆ తరువాత మరోసారి నితిన్‌తో కలిసి ‘ఛల్‌ మోహన్‌రంగ’లో నటించింది.  ప్రస్తుతం మేఘా తెలుగులో ‘మనుచరిత్ర’తో పాటు ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో  అతిథి పాత్రలో నటిస్తోంది. 

ఇదీ చదవండి:

శంకర్‌ - రామ్‌చరణ్‌ చిత్రంలో కథానాయికగా రష్మిక?

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని