‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో బాలకృష్ణ వారసుడి తెరంగేట్రం - mokshagna getting launched with aditya369 sequel
close
Updated : 11/06/2021 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో బాలకృష్ణ వారసుడి తెరంగేట్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన వారసుడు మోక్షజ్ఞ సినిమా తెరంగేట్రంపై స్పష్టత ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన, తాను హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య369’కు స్వీకెల్‌తోనే తన వారసుడిని తెరకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఆ సినిమాలో తాను కూడా నటిస్తానని చెప్పి డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ సినిమాకు తానే కథ రాయడంతో పాటు దర్శకత్వం వహిస్తానని చెప్పడం విశేషం. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా 1991 ఆగస్టు 18న విడుదలైంది. ఆ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఎస్‌.అనితాకృష్ణ నిర్మించారు. అమ్రీష్‌ పురి, టిన్నూ ఆనంద్‌, మోహినీ, సుత్తివేలు, సిల్క్‌ స్మిత, తరుణ్‌(బాల నటుడు) కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. 1960 జూన్‌ 10న జన్మించిన బాలకృష్ణ తన 14వ ఏట 1974లో బాల నటుడిగా సినిమాల్లోకి వచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని