పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
ఆసక్తిగా ‘మోసగాళ్లు’ ట్రైలర్
ఇంటర్నెట్ డెస్క్: ‘డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని’ అని అంటున్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడుగా జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన చిత్రం ‘మోసగాళ్లు’. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. వాస్తవికతతో కూడిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ‘ప్రతి వాడికి సిటీ మొత్తం కనిపించే ఎత్తులో ఉండాలనేదే కోరిక. మనం పైనున్నప్పుడు ఏం చేస్తామో.. దాన్ని బట్టి మనం ఎంతకాలం పైనుంటామో డిసైడ్ అవుతుంది’, ‘డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదు’ అనే డైలాగులు అలరిస్తున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోందీ ప్రచార చిత్రం. మరి ఈ మోసగాళ్ల కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. నవదీప్, నవీన్ చంద్ర, రుహీసింగ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంగీతం: శ్యామ్ సి.ఎస్.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- రంభ అభిమానిగా జగపతిబాబు!
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్ జానకి
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
కొత్త పాట గురూ
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..