close
Published : 27/02/2021 23:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, నటి కంగనా రనౌత్‌కు మధ్య  2016లో నకిలీ ఈ-మెయిల్‌ వ్యవహారం గురించి పెద్ద దూమారమే రేగింది. ఈ నకిలీ ఈ-మెయిల్‌ ఫిర్యాదు గురించి వాంగ్మూలం నమోదు చేయడానికి ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ ఈరోజు హృతిక్‌ రోషన్‌ని పిలిపించి రికార్డు చేశారు. దీనిపై కంగనా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రపంచం చాలా మారిపోయింది. నా మాజీ ప్రియుడు(హృతిక్‌) ఇంకా అందులోనే చిక్కుకుని పోయారు. అందులో నుంచి బయటపడటానికి ఇబ్బంది పడుతున్నాడు’’ అంటూ వ్యంగ్యంగా పేర్కొంది. నకిలీ ఈ-మెయిల్ ఐడీ కేసు కోసం హృతిక్ రోషన్ తాజాగా ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. పెండింగ్‌లో ఉన్న నకిలీ ఈ-మెయిళ్ల దర్యాప్తునకు సంబంధించి 2020 డిసెంబర్‌లో హృతిక్ తరపు న్యాయవాది ముంబై పోలీసు కమిషనర్‌ను సంప్రదించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత దానిని క్రైమ్ బ్రాంచ్ సీఐయూకు బదిలీ చేసినట్లు అధికారి తెలిపారు. 

కంగనా-హృతిక్‌ల మధ్య ప్రేమ వ్యవహారం 2016లోనే కోర్టుకెక్కింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య నడుస్తున ఈ కేసు మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కంగనా గతంలో చెప్పిన విషయాలన్నింటినీ కొట్టిపారేశాడు హృతిక్. అసలు ఆ ఈ-మెయిల్స్‌తో తనకెలాంటి సంబంధం లేదని, ఎవరో నకిలీ అకౌంట్‌ సృష్టించి తన పేరుతో కంగనాకి ఈ-మెయిల్స్ పంపించారని హృతిక్ చెప్పారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని