హైదరాబాద్: అల్లరి నరేశ్ ఎక్కువగా హాస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుంటారు. కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న ‘నాంది’ చిత్రంతో మరోసారి తనలోని సీరియస్ నటుడిని నరేశ్ చూపించబోతున్నారు. తాజాగా ఆ చిత్రంలోనే ‘ఇదే నాంది..’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. సాయిచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేయగా సింగర్ విజయ్ ప్రకాష్ భావోద్వేగంగా ఈ పాటను ఆలపించారు. చైతన్య ప్రసాద్ దంతులూరి సాహిత్యం అందించారు. ఇటీవలే విడులైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటిదాకా ఈ లిరికల్ వీడియోను చూసేయండి!
ఇవీ చదవండి!
సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్హష్మీ?
అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!