Jaathiratnalu: నెటిజన్‌కు నవీన్‌ సర్‌ప్రైజ్‌ - naveenpolishetty surprises a netizen with a video call
close
Published : 16/05/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jaathiratnalu: నెటిజన్‌కు నవీన్‌ సర్‌ప్రైజ్‌

‘అమ్మ మరలా నవ్వింది’ అంటూ ట్వీట్‌

హైదరాబాద్‌: నటుడు నవీన్‌ పొలిశెట్టి ఓ నెటిజన్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈమేరకు వీడియో కాల్‌ చేసి నెటిజన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇటీవల కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని, అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతోందని మే 5న సాయి స్మరణ్‌ అనే నెటిజన్‌ ఓ ట్వీట్‌ పెట్టాడు. అంతేకాకుండా ‘జాతిరత్నాలు’ వీక్షించిన తర్వాత ఆమె కొంత ఊరట పొందారని పేర్కొంటూ నవీన్‌ పొలిశెట్టిని ట్యాగ్‌ చేశాడు. కాగా, సాయి పెట్టిన ట్వీట్‌ చూసిన నవీన్‌.. ‘మనకెంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు ‘జాతిరత్నాలు’ కొంతవరకూ ఊరట కలిగించినందుకు ఆనందిస్తున్నా. మీ వివరాలను నాకు పంపించండి త్వరలోనే సర్‌ప్రైజ్‌ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్‌.. సాయికి ఫోన్‌ చేశారు. సాయి వాళ్లమ్మతో కొంత సమయంపాటు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘అమ్మ మరలా నవ్వింది. బాధ నుంచి బయటపడడం కోసం ప్రేమ ఎంతో అవసరం. అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయండి’ అని ట్వీట్‌ పెట్టారు. ఇక, ‘జాతిరత్నాలు’ విషయానికి వస్తే అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్ నిర్మించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని