close
Published : 29/03/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నిన్ను చేరి’ వెబ్‌ సిరీస్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌: రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్‌లుగా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోర్‌ దాసు కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ దర్శకుడు. హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్‌గా శంకర్ చిత్ర పరిశ్రమలో సుపరిచితులు. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి, ‘నిన్ను చేరి’ బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు 175 సినిమాలకు పంపిణీదారుగా వ్యవహరించినట్లు చెప్పారు. ఇప్పుడు నిర్మాతగా మారి ‘నిన్ను చేరి’ వెబ్‌సిరీస్‌ తీస్తున్న సందర్భంగా సోదర సమానుడైన వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు సాయికృష్ణ తల్లాడ మాట్లాడుతూ ‘నేను సినిమాలు చేస్తున్నప్పుడు విడుదల సమయంలో థియేటర్‌లలో సరైన టైమ్‌కి విడుదల అయ్యేలా శంకర్‌గారు ఎంతో కృషి చేశారు. సినిమాపై శంకర్‌గారికి ఉన్న గౌరవం అప్పుడే తెలిసింది. అలాంటి వ్యక్తితో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వినాయక్‌గారు లోగోను విడుదల చేయటం మా ఆనందం రెట్టింపు అయింది. కరోనా టైమ్‌లో తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాజెక్ట్‌ని షూట్ చేశాం’ అని అన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని