ఇంటర్నెట్ డెస్క్: ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ జైలు గోడల మధ్య ‘చెస్’లో తన ప్రతిభ చూపించి ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకున్నాడన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘చెక్’. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రియాప్రకాశ్ వారియర్, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్లు. భవ్యక్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఒకే ఒక్క పాట ఉన్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘నిన్ను చూడకుండ ఉండలేకపోతున్నాను’ అంటూ సాగే ఆ వీడియో సాంగ్ ప్రోమోను తాజాగా విడుదల చేసింది. అందులో నితిన్‌తో కలిసి ప్రియ స్టెప్పులేసింది. శ్రీమణి రచించిన ఈ పాటను హరిచరణ్, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. కల్యాణి మాలిక్ బాణీలు కూర్చారు. ఆలస్యమెందుకు..! ఆ పాటను మీరూ చూడండి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!