NoraFatehi: లాట‌రీ టికెట్లూ అమ్మాను  - nora fatehi doing work for family
close
Published : 17/05/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NoraFatehi: లాట‌రీ టికెట్లూ అమ్మాను 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న త‌న కుటుంబాన్ని పోషించేందుకు 16వ సంవత్స‌రంలోనే ప‌నిలో చేరార‌ని వెల్లడించింది బాలీవుడ్ భామ నోరా ఫ‌తేహి. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నోరా త‌న జీవితం గురించి  తెలియ‌ని ప‌లు విష‌యాల్ని పంచుకుంది. ‘ఒకప్పుడు మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.  అది చూసి చేత‌నైన సాయం చేయాల‌నిపించి నేను మా పాఠ‌శాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఓ మాల్‌లో రిటైల్ సేల్స్ అసోసియేటివ్‌గా చేరాను. ఆ త‌ర్వాత ప‌లు రెస్టారంట్లు, బార్ల‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేశాను. ఓ వ‌స్త్ర దుకాణంలోనూ కొన్ని రోజులు ప‌ని చేశాను. అంతేకాదు లాట‌రీ టికెట్లూ అమ్మాను’ అని గుర్తు చేసుకుంది. డ్యాన్స‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చ‌కున్న ఈ కెన‌డా భామ టెంప‌ర్ చిత్రంలోని ప్ర‌త్యేక గీతంతో టాలీవుడ్‌కి ప‌రిచయ‌మైంది. ప్ర‌స్తుతం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో న‌టిస్తోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని