close
Published : 11/04/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చుప్కే చుప్కే విడుదలై నేటికి 46 ఏళ్లు

ఈ సందర్భంగా తన ఇంటి రహస్యాన్ని బయట పెట్టిన అమితాబ్‌ 

దిల్లీ: 1975లో హృషికేశ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన చుప్కే చుప్కే సినిమా విడుదలై నేటికి 46 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అమితాబ్‌ అలనాటి చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ సుకుమార్‌ సిన్హగా నటించడగా, వసుధ కుమార్‌ పాత్రలో జయాబచ్చన్‌ నటించారు. 

సినిమాలోని జయాబచ్చన్‌, అమితాబ్‌ కలిసి ఉన్న ఒక సన్నివేశానికి సంబంధించిన ఒక ఫొటోను బిగ్‌ బి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. దానికి వ్యాఖ్యగా ఆ సన్నివేశం ప్రముఖ నిర్మాత ఎన్‌సి సిప్పీ ఇంట్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఆ ఇంటిని అమితాబ్‌ కొనుక్కొని మరమత్తులు చేయించారట. ఆ ఇంటికే ‘జల్సా’ అని పేరు.

‘‘ హృషీకేష్‌ ముఖర్జీ రూపొందించిన చుప్కే చుప్కే సినిమా నేటికి 46 ఏళ్ల పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మీరు చూసే ఇల్లు నిర్మాత ఎన్‌సి సిప్పీది. ఈ ఇంటిని మేము కొని, అమ్మేశాము. మళ్లీ కొని దానికి మరమత్తులు చేయించాం. ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు అదే ‘జల్సా’. ఈ ఇంటిలో ఆనంద్‌, నమక్‌ హరామ్‌, చుప్కే చుప్కే.. ఇలా చాలా సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది.’’ అని బిగ్‌ బి తెలిపారు. 

ఇదే పోస్టును బిగ్‌ బి ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు. మరికొన్ని చిత్రాలను జతచేశారు. వాటిలో మొదటి చిత్రంలో దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ, అమితాబ్‌ ఉన్నారు. రెండో చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, అస్రానీలు కలిసి ఉన్న ఒక సన్నివేశాన్ని చూడొచ్చు.



1380951044276977670

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని