మా సోదరుడు విజయాన్ని అందుకోవాలి - paruchuri gopalakrishna about son of india first lyrical song
close
Published : 17/06/2021 13:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా సోదరుడు విజయాన్ని అందుకోవాలి

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ లిరికల్‌ వీడియోపై పరుచూరి

హైదరాబాద్‌: ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంతో మోహన్‌బాబు మంచి విజయాన్ని అందుకోవాలని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్‌ లిరికల్‌ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. ‘జయ జయ మహావీరా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పాట గురించి పరుచూరి మాట్లాడుతూ...

‘పదకొండో శతాబ్దంలో రచించబడిన శ్రీ రఘువీర గద్యం.. 21 శతాబ్దంలో ఈనాడు ప్రేక్షకులు చూడగలుగుతున్నారంటే.. లక్ష్మిప్రసన్న పిక్చర్స్‌, 24 క్రాఫ్ట్స్‌ వారికే అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం రచించిన ఆ రామ స్తుతిని ఇవాళ ప్రేక్షకులు మరలా విని.. ఇంత గొప్ప రామస్తుతి ఉందా? అని తెలుసుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఈ రెండు నిర్మాణ సంస్థలే. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో ముగ్గురు మాస్టర్లు ఉన్నారు. ఇళయరాజా సంగీతంలో మాస్టర్‌. మోహన్‌బాబు నటనలో మాస్టర్‌. అలాగే విష్ణు నిర్మాణంలో మాస్టర్‌. తండ్రి సినిమాని ఎలా అయినా సూపర్‌హిట్‌ చేయాలని తపన అతనికి ఉంది. అలాగే, మా సోదరుడు మోహన్‌బాబు సైతం ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని పరుచూరి పేర్కొన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని