close
Published : 17/04/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ బాలీవుడ్‌ దర్శకుడితో ప్రభాస్‌ కొత్త మూవీ?

ప్రభాస్‌ సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు సినిమాల పనులతో బిజీగా ఉన్నారాయన. ఆ తర్వాత చేయనున్న చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ప్రభాస్‌ కోసం ‘వార్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ పూర్తిస్థాయిలో కథని సిద్ధం చేసి వినిపించారని, త్వరలోనే ఆ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

మొన్నటిదాకా ‘ఆదిపురుష్‌’ సినిమా చిత్రీకరణతో ముంబయిలోనే గడిపారు ప్రభాస్‌. కరోనాతో అక్కడ ఆ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. శనివారం నుంచే హైదరాబాద్‌లో ఆరంభం కానున్న ‘రాధేశ్యామ్‌’ కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగనున్నారు ప్రభాస్‌. కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, పాటనీ  తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని