Salman Radhe: ‘రాధే’ దెబ్బకు సర్వర్లు డౌన్‌ - radhe released streaming platform crashed
close
Published : 13/05/2021 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Salman Radhe: ‘రాధే’ దెబ్బకు సర్వర్లు డౌన్‌

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన చిత్రం ‘రాధే’. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ గురువారం విడుదలైంది. అయితే.. ఒక్కసారిగా వినియోగదారులు సినిమా కోసం లాగిన్‌ కావడంతో ఓటీటీ వేదిక ‘జీ5’, ‘జీఫ్లెక్స్‌’ సర్వర్లు స్తంభించిపోయాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన దిశాపటానీ నటించింది. అయితే.. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చూసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో సినీ ప్రియులు ఓటీటీలోకి లాగిన్‌ అయ్యారట. దీంతో సర్వర్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణాలు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్విటర్‌లో పేర్కొంది. కాగా.. కొంతమంది వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండానే సినిమాను వీక్షించారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌దీప్‌ హుడా, మేఘా ఆకాశ్‌, జకా ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని