radhe shyam: చేయూతనిచ్చిన చిత్ర బృందం - radhe shyam team donate set property
close
Published : 10/05/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

radhe shyam: చేయూతనిచ్చిన చిత్ర బృందం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ఆసుపత్రిలోని సమస్యని గమనించి, పరిష్కార మార్గాన్ని చూపింది ‘రాధే శ్యామ్‌’ చిత్ర బృందం. ఇటలీ నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం భారీ ఆసుపత్రి సెట్‌ని రూపొందించారు. చిత్రీకరణ పూర్తవడంతో సెట్‌ని తొలగించి బెడ్లు, స్ట్రెచర్లు తదితర వస్తువుల్ని హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఓ చోటుకి తరలించారు. అయితే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలకొన్న బెడ్లు కొరత తీర్చేందుకు, కొవిడ్‌ బాధితులకు చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చింది చిత్ర బృందం. షూటింగ్‌కి వినియోగించిన 50 బెడ్లు, స్ట్రెచర్లు, సెలైన్‌ స్టాండ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లని ఆసుపత్రి వర్గాలకి ఇటీవల అందించింది.

తాజాగా ఈ చిత్ర ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ దీనిపై స్పందించారు. ‘నా బంధువుల్లో ఒకరికి బెడ్‌ అవసరమైంది. దాంతో నాకు తెలిసిన ఆసుపత్రి సీఈఓని సంప్రదించాను. కానీ, ఫలితం లేదు. అక్కడ కొత్తగా వచ్చే బాధితులకి బెడ్లు లేవని చెప్పారాయన. వాటిని సేకరించేందుకూ ఇబ్బందులు పడుతున్నారు అక్కడి సిబ్బంది. నాకు పరిస్థితి అర్థమైంది. దాంతో ఆసుపత్రి సెట్‌లో వినియోగించిన వాటిని కొవిడ్‌ బాధితుల కోసం ఇద్దామా అని మా చిత్ర బృందాన్ని అడిగాను. వారంతా వెంటనే అంగీకరించారు. ఈ విషయంపై ప్రభాస్‌తో సహా అందరూ సంతోషం వ్యక్తం చేశారు’ అని తెలిపారు రవీందర్‌. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. యూవీ క్రియేషన్‌ సంస్థ నిర్మిస్తోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని