ఇంటర్నెట్‌డెస్క్: విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు నటుడు విజయ్‌సేతుపతి. మలయాళంలో జయరాం, సేతుపతి ప్రధానపాత్రలలో ‘రేడియో మాధవ్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. తాజాగా ఆ సినిమాలోని ‘ఏంట్రా మన ఖర్మా..’అంటూ సాగుతున్న సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ పాటలో మక్కల్ సెల్వన్ విజయ్ తనదైన స్టైల్లో చిందులు వేస్తూ అలరించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మరికొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సనీల్ కలాథిల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి జయచంద్రన్ స్వరాలు సమకూర్చారు. తెలుగులో లక్ష్మీ చెన్నకేశవ ఫిల్మ్స్ పతాకంపై థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని మరో నటుడు జయరామ్ తెలుగులో ‘భాగమతి’ ‘అలవైకుంఠపురం’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు విజయ్‌సేతుపతి ఇటీవలే విడుదలైన ‘ఉప్పెన’ చిత్రంలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి!
సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్హష్మీ?
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!