close
Published : 17/04/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వీటీ వెంటపడుతున్న గెటప్‌ శ్రీను

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జబర్దస్త్‌’ ద్వారా ఎంతోమంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న బుల్లితెర నటుడు గెటప్‌ శ్రీను. ఈసారి హీరోగా అవతారం ఎత్తి అలరించేందుకు సిద్ధమయ్యాడు. గెటప్‌ శ్రీను హీరోగా, కృష్ణమాచారి దర్శకత్వంలో ‘రాజుయాదవ్‌’ చిత్రం తెరకెక్కుతోంది. అంకిత ఖారత్‌ కథానాయిక. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు. సాయి వరుణవి క్రియేషన్స్‌ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు  సంబంధించి ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం పంచుకుంది. స్వీటీ.. అంటూ హీరోయిన్‌ వెనకాల రాజుయాదవ్‌ (గెటప్‌శ్రీను) పరుగెత్తుతూ ఆ వీడియోలో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. మీరూ చూసేయండి మరి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని