ఏం మాట్లాడుతున్నారు ఈ లేడీస్‌! - rakul and manchu lakshmi fun with rana
close
Published : 30/04/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏం మాట్లాడుతున్నారు ఈ లేడీస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు లక్ష్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని ఉద్దేశించి ‘ఏం మాట్లాడుతున్నారు ఈ లేడీస్’ అంటూ సందడి చేశారు రానా దగ్గుబాటి. ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నంబరు 1 యారి’ కార్యక్రమానికి మంచు లక్ష్మి, రకుల్‌ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ షోలో వీళ్లద్దరు రానాని పలు ప్రశ్నలు అడిగి నవ్వులు పూయించారు. ‘నంబరు 1 యారి.. మమ్మల్ని కదిపితే గత చరిత్ర ఏమైనా చెప్తావేమోనని, కోపమా ఇరిటేషనా నాకసలు అలాంటి పదాలు తెలీవు’ అంటూ తనదైన శైలిలో మాట్లాడి అలరిస్తున్నారు లక్ష్మి. ‘పడుకున్నావా లేచావా ఏం చేస్తున్నావ్‌.. ఏయ్‌’ అని లక్ష్మి అరవగానే.. ‘నేను వద్దని చెప్పినా మళ్లీ వస్తాడు’ అంటూ రకుల్‌ చెప్పిన సమాధానం రానాని అయోమయంలో పడేసింది. ‘అరే ఏం మాట్లాడుతున్నారు ఈ లేడీస్‌’ అని రానా అనగానే నువ్వు ఐస్‌క్రీమ్‌ బాయ్‌వా అంటూ లక్ష్మి విసిరిన పంచ్‌ ఆకట్టుకుంటోంది. ఈ హంగామా మొత్తం చూడాలంటే మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని