రకుల్‌ పాత్ర నిజమేనట! - rakul preet singh role in doctor ji
close
Published : 08/05/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ పాత్ర నిజమేనట!

దక్షిణాదిలో అగ్రతారగా కొనసాగుతుండగానే బాలీవుడ్‌ బాట పట్టింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడా మంచి అవకాశాలే అందుకుంటోంది. చాలామంది నాయికల మాదిరే రకుల్‌ కొత్త దారిలో వెళ్లడానికి సిద్ధమవుతోంది. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న ‘డాక్టర్‌ జి’లో వైద్య విద్యార్థినిగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ బోల్డ్‌ కథలో నటించనుంది. ఆమె ఓ కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో నటించడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయం గురించి కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. తాజాగా దర్శకుడు తేజస్‌ డియోస్‌కర్‌ మాట్లాడుతూ ‘‘మాది సామాజిక ఇతివృత్తంతో సాగే కుటుంబ కథా చిత్రం. కండోమ్‌ల ఉపయోగం ప్రధానమైన నేపథ్యంగా కథ సాగుతుంది. ఇందులోని పాత్రకు రకుల్‌ అయితేనే వందశాతం సరిపోతుందని నా నమ్మకం. ఇలాంటి సున్నితమైన, ఆలోచన రేకెత్తించే కథలోని పాత్రకు ఆమే మా తొలి ప్రాధాన్యం. ఈ కథని రకుల్‌కి వినిపించగానే అంగీకరించారు’’అని చెప్పారు. సాధారణంగా కండోమ్‌ కంపెనీలు ‘కండోమ్‌ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌’లను నియమించుకుంటాయి. వాళ్లు తయారుచేసే కండోమ్‌లు మార్కెట్‌లోకి వెళ్లడానికి ముందే వాటి నాణ్యతను ఈ ఎగ్జిక్యూటివ్‌లు చెక్‌ చేస్తారు. వీళ్లనే కండోమ్‌ టెస్టర్‌లు అని   పిలుస్తారు. ఈ సినిమాకి ‘ఛత్రివాలి’ అనే పేరుని అనుకుంటున్నారట. కొన్ని స్థానిక భాషల్లో కండోమ్‌ని ఛత్రి అని పిలుస్తారు. అందుకే ఈ పేరుని పెట్టనున్నారట. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని