కొవిడ్‌పై కలిసి పోరాటం చేద్దాం రండి! - rakul starts fundraiser for covid-19 patients
close
Published : 13/05/2021 23:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌పై కలిసి పోరాటం చేద్దాం రండి!

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది కొవిడ్‌ బాధితులు బెడ్స్, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత సంక్షోభంలో తనవంతుగా సాయం అందించడానికి ముందుకొచ్చింది నటి రకుల్ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఆమె ‘గివ్ ఇండియా’తో పేరుతో నిధుల సేకరణ ప్రారంభించింది. ప్రజలు తమవంతుగా కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా విరాళాలు ఇవ్వాలని కోరింది. ‘‘ప్రతిరోజూ మనం ఎన్నో బాధాకరమైన వార్తలు వింటున్నాం. చూస్తున్నాం. చాలా హృదయవిదాకరంగా ఉంది. ఈ తరుణంలో నిధులు సమాకూర్చి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ప్రాణాలు కాపాడే పరికరాలు సమకూర్చగలిగితే కొంతైనా వారికి ఉపయోగపడతాం. ప్రతి ఒక్కరు 100 రూపాయల విరాళం ఇవ్వండి. ప్రజలకు వీలైతే అంతకంటే ఎక్కువ మొత్తం ఇవ్వవచ్చు. మీరందించే సాయం ఎంతో ముఖ్యం. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ అభ్యర్థిస్తున్నానని’’ తెలిపింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో ‘సర్దార్ కా గ్రాండ్‌ సన్‌’ చిత్రంలో అర్జున్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది. మే 18న ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి క్రిష్ దర్శకత్వంలో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటించింది.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని