RANA: ఒక్కరోజు ప్రధాని అయితే ఏం చేస్తాడు..? - rana 1 day pm aithe
close
Published : 04/05/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RANA: ఒక్కరోజు ప్రధాని అయితే ఏం చేస్తాడు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటని ఎదురైన ప్రశ్నకు ప్రముఖ నటుడు రానా బదులిచ్చారు. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ.. మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది. రానా స్పందిస్తూ.. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే దేశం అంతా మారిపోతుందని తాను భావిస్తున్నానని రానా అన్నారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ నవ్వుల పువ్వులు పంచింది.

కాగా.. విభిన్నమైన కథలతో అలరిస్తూ వస్తున్న రానా పలు సినిమాల్లో రాజకీయ నాయకుడిగానూ కనిపించి మెప్పించారు. లీడర్‌, నేను రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్‌ కథా నాయకుడు, ఎన్టీఆర్‌ మహా నాయకుడు వంటి చిత్రాల్లో రానా పొలిటికల్‌ లీడర్‌గా కనిపించారు. కాగా.. రానా నటించిన ‘విరాటపర్వం’ చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని