close
Published : 23/03/2021 17:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కొత్త నీలి రంగు పొంగెనే’ అంటోన్న కీర్తి! 

హైదరాబాద్‌: నితిన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర  నాగవంశీ  నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ లిరికల్‌ వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘నా కళ్లలో కొత్త నీలి రంగు పొంగెనే... అవి నిన్ను చూసినప్పుడే...నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనె’’ అంటూ సాగిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా శ్వేతా మోహన్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. చిత్రంలో నరేష్‌, రోహిణి, కౌసల్య, బ్రహ్మీజీ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌, సుహాస్‌ తదితరులు  నటిస్తున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని