అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది: రష్మిక - rashmika shares pearls of wisdom for peole and fans
close
Published : 10/06/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది: రష్మిక

ఇంటర్నెట్‌ డెస్క్: తక్కువ కాలంలోనే అగ్రకథానాయికల జాబితాలో చేరిన అందాల నాయిక రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలోనూ నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అందాల భామ అభిమానులను, అనుచరులను ఉద్దేశించి విలువైన ఆణిముత్యాల్లాంటి మాటలను పంచుకుంది.

రష్మిక ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘నా స్నేహితుడు నాకొకటి చెప్పారు. అది మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మీకు నచ్చిన అంశంపై సమయాన్ని వెచ్చించండి. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అది మీకు చిరునవ్వు, సంతోషం.. ఇంకా ఆనందాన్ని ఇస్తుందని.’’ పేర్కొంది. ప్రస్తుతం కరోనా రెండో దశలో తన వంతుగా ఇతరులకు మాట సాయం చేయడానికి #SpreadingHope ’ను ప్రారంభించింది. ఇతరులకు అవసరమైన సందేశాన్ని పంచుకొని  ఆశావహ రీతిలో సహాయపడమనేది దీని ప్రధాన ఉద్దేశ్యం.  రష్మిక గత ఏడాది తెలుగులో 'సరిలేరు నీకేవరు', ‘భీష్మ’ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప’లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించాయి. సినిమా త్వరలోనే విడుదల కానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని