మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
ఇంటర్నెట్ డెస్క్: తన చిరునవ్వులతో కుర్రాళ్ల మనసులు కొల్లగొడుతున్న యువ కథానాయిక రష్మిక మందన. ఈ అమ్మడు దక్షిణాది నుంచి తాజాగా బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీ కథానాయకుడు సిద్దార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం మార్చి 4న లఖ్‌నవూకు వెళ్లనుంది. తొలిసారిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక ఈ సినిమా షూటింగ్ కోసం చాలా ఉత్సాహంగా ఉంది. స్పై థ్రిల్లర్ చిత్రంగా వస్తోన్న చిత్రానికి శంతన్ బాగ్చి దర్శకత్వం వహిస్తుండగా, ఆర్ఎస్వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ మీడియా, ఎల్ఎల్పీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చిత్రంలో పర్మీత్ సేథి, షరీబ్ హష్మీ, అర్జన్ బజ్వాలు తదితరులు నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఫిబ్రవరి 11, 2021 ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్నట్లు రష్మిక ఈ మధ్యే ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ కథానాయకుడిగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13, 2021న తెరపైకి రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- తారక్ అభిమానులకు శుభవార్త!
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
‘ఖిలాడి’ వచ్చేశాడు..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
- మా క్రమశిక్షణ సంఘానికి చిరంజీవి రాజీనామా!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్