ఆధునిక ద్రౌపదిగా రియా చక్రవర్తి? - rhea chakraborty offered to play the role of draupadi
close
Published : 10/06/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధునిక ద్రౌపదిగా రియా చక్రవర్తి?

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ భామ రియా చక్రవర్తి గత కొంతకాలంగా మీడియాలో బాగా వినిపించిన పేరు. బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నటి రియా చక్రవర్తిని గత ఏడాదిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం రియాకు ఓ భారీ ప్రాజెక్టులో ద్రౌపది పాత్ర పోషించే అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నాటి పురాణ ఇతిహాసమైన మహాభారతం నుంచి ప్రేరణగా రూపొందనున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుందట. ఇందులో రియా ఆధునిక ద్రౌపదిగా కనిపించనుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రారంభ దశలోనే ఉందట. చర్చలు జరుగుతున్నాయి. రియా గతంలో ఇలాంటి పాత్ర పోషించలేదట. ఇందులో ఆమె సరికొత్తగా కనిపించనుందట. అయితే రియా ఇంకా చిత్రం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. సినిమాపై చర్చలు పూర్తి కాగానే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని బాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవల ది టైమ్స్ విడుదల చేసిన ‘ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020’ జాబితాలో రియా చక్రవర్తి చోటు దక్కించుకుంది. రియా అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీలతో కలిసి ‘చెహ్రే’ చిత్రంలో నటించింది. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. రియా మళ్లీ గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చురుగ్గా పాల్గొంటోంది. తెలుగులో రియా - ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలో వచ్చిన ‘తూనీగ తూనీగ’లో కథానాయికగా సినీ రంగప్రవేశం చేసింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని